భారీగా తగ్గిన హెచ్‌డీఎఫ్‌సీ ఆదాయం!

by  |
భారీగా తగ్గిన హెచ్‌డీఎఫ్‌సీ ఆదాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: గృహ రుణాలకు క్షీణించిన డిమాండ్ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద గృహ రుణాల సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్ప్(హెచ్‌డీఎఫ్‌సీ) సంస్థ లాభాలు భారీగా క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 66 శాతం తగ్గి రూ. 2,925.8 కోట్లకు చేరుకున్నాయి. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 8,372 లాభాలను సంస్థ ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 42.3 శాతం క్షీణించి రూ. 11,707 కోట్లుగా నమోదయ్యాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను మునుపటి త్రైమాసికంతో పోల్చలేమని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో వ్యక్తిగత రుణాల వృద్ధి 26 శాతం సాధించామని కంపెనీ పేర్కొంది. త్రైమాసికం ముగింపులో గణనీయమైన రికవరీ, బలమైన వృద్ధి కనిపించిందని కంపెనీ తెలిపింది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కోసం రూ. 7,076 కోట్ల రుణాలను కేటాయించినట్టు కంపెనీ పేర్కొంది. అదేవిధంగా, హెచ్‌డీఎఫ్‌సీ స్థూల నిరర్ధక రుణాలు డిసెంబర్ 31 నాటికి 1.67 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం 3.7 శాతం పెరిగి రూ. 2,678.65 వద్ద ర్యాలీ చేశాయి.

Next Story

Most Viewed