సమంతకు మైండ్ దొబ్బిందా..ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతోంది ఏంటీ?

by Disha Web Desk 18 |
సమంతకు మైండ్ దొబ్బిందా..ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతోంది ఏంటీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడుకు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏ పని చేసినా అది నెట్టింట ట్రోల్ అవుతూనే ఉంటుంది. కాగా, తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? ఈ నటి టాలీవుడ్ హీరోను కాదని, బాలీవుడ్ హీరోకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మధ్య ఆ నటుడితో జాలీగా, సరదాగా తిరుగుతున్నట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలవరీ యాప్ జొమాటో యాడ్‌లో సమంత రన్వీర్ సింగ్‌తో కలిసి నటించింది. అయితే ఇందులో రామ్ చరణ్ చేయాల్సి ఉండేదంట. అయితే మేకర్స్ రామ్ చరణ్, రన్వీర్ సింగ్ ఈ ఇద్దరిలో యాడ్ చేయడానికి నువ్వు ఎవరికి ఓటు వేస్తావని అడగ్గా సమంత టాలీవుడ్ స్టార్ హీరోను కాదని, బాలీవుడ్ హీరోకు ఓటు వేసినట్లు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో సమంత, రన్వీర్ సింగ్ ఇద్దరూ కలిసి ఈ యాడ్‌లో నటించారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ సమంతను తెగ ఆడేసుకుంటున్నారు. ఏంటీ సామ్ ఇలా మారిపోయావు, చరణ్‌ను కాదని రన్వీర్ సింగ్‌తో ఎందుకు అంత క్లోజ్‌గా ఉంటున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story