ద్వేషపూరిత ట్రోల్స్ చేసే వారిపై చర్యలు అవసరం

by  |
ద్వేషపూరిత ట్రోల్స్ చేసే వారిపై చర్యలు అవసరం
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా తండ్రి మెయిన్ లీడ్‌లో వచ్చిన ఏకే వర్సెస్ ఏకే సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించిన హర్షవర్ధన్… చాలా సార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అయితే అలాంటి వేధింపులు జీవితాలను నాశనం చేస్తాయని అంటున్నారు. ఇలాంటి విషపూరిత విమర్శలు మనల్ని చాలా గాయపరుస్తాయని, మానసికంగా ప్రభావం చూపుతాయన్నారు.

వీటి నుంచి కోలుకునేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుందన్న కపూర్..కొంత మంది మూర్ఖులు తమ కీబోర్డుల వెనుక కూర్చొని చెత్త రాయడం వల్ల అమాయకులు తమ జీవితంపై నిరాశను వ్యక్తం చేస్తున్నారన్న విషయం గుర్తించాలని చెప్పారు. ఇది చాలా తప్పని.. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు కచ్చితంగా ఒక మార్గం కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడేముందు ఒక్కసారి ఆలోచించని, మైండ్ లేని ద్వేషపూరిత ట్రోల్స్‌ను ఆపేందుకు మనందరం కలిసి రావాలని కోరారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం చట్టపరమైన ఆమోదం ఉండాలని అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed