వ్యవసాయ రంగం మద్దతుతో వృద్ధి వేగవంతం.. నీతి ఆయోగ్ వైస్-చైర్మన్

by  |
vice chairmen
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మద్దతుతో భారత ఆర్థికవ్యవస్థ 10 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. రికార్డు స్థాయిలో ఖరీఫ్ పంటకు తోడు రబీ పంట మద్దతు గణనీయంగా ఉందని ఆయన తెలిపారు. అయితే సరఫరా వ్యవస్థ పరిమితంగా ఉండటం, పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక పునరుద్ధరణకు ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల విషయంగా ఉందని రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ‘వ్యవసాయ రంగ కీలక మద్దతుతో 2021-22లో జీడీపీ వృద్ధి 10 శాతానికి మించి ఉంటుందని ఆశిస్తున్నాము.

గ్రామీణ డిమాండే దీనికి ప్రధాన మద్దతు. అలాగే, సామర్థ్య వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా తయారీ రంగం ప్రోత్సాహాన్నిస్తుందని’ కుమార్ వివరించారు. అదేవిధంగా ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల, ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పనను కూడా పెంచుతుందని కుమార్ భావించారు. కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల రంగం పుంజుకోవడం ద్వారా వృద్ధి వేగాన్ని మరింత తోడ్పాటు అందిస్తుందని, దేశవ్యాప్తంగా వేగవంతంగా కొనసాగుతున్న కరోనా టీకా పంపిణీ భవిష్యత్తులో కొవిడ్ వేవ్‌ల ప్రమాదాన్ని తగ్గించగలదని కుమార్ అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed