దేశంలో కిట్ల కొరత…ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం!

by  |
దేశంలో కిట్ల కొరత…ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ కిట్లను ఎగుమతి చేయడం శ్రేయస్కరం కాదని వాటి ఎగుమతులపై నిషేధం ప్రకటించింది. శనివారం ఉదయం ఇచ్చిన ఈ ఆదేశాలు తక్షణమే అమలు అవుతాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైన రక్షణ పరికరాలు, సంరక్షణ మౌలిక సదుపాయలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుంటే, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే సిబ్బందికి తగినన్ని వ్యక్తిగత రక్షణ సామాగ్రి లేకపోవడం పెద్ద సవాలుగా మారింది. వ్యాధి నిర్ధాణ పరికరాలతో పాటు పీపీఈల అవసరం ఎంతో ఉంది. అవి లేకపోతే ఆరోగ్య వ్యవస్థ ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వారం క్రితం వరకూ రోజుకు పది ఇరవైగా పెరుగుతున్న కేసులు ఈ వారం వందల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. వీలైనన్ని ఆరోగ్య రక్షణ పరికరాలను సమకూర్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోనే పీపీఏలకు కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి రాజధానిలో 8 వేల పీపీఏ కిట్లు మాత్రమే మిగిలాయని స్వయంగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇప్పుడున్న కేసులను దృష్టిలో ఉంచుకుని కనీసం 50 వేల కిట్లు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు వేల కేసులు నమోదయ్యాయి.

tags: personal protection equipment, coronavirus updates, exports, foreign trade


Next Story

Most Viewed