పలు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు!

by  |
పలు రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను పెంచి ఆర్థికవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయాలను అమలు చేయనుంది. నిర్మాణం, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్ లాంటి రంగాలకు దేశీయంగా ఉద్యోగాలు కల్పించేలా ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వ సడలించే అవకాశం ఉంది. రానున్న బడ్జెట్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ వంటి రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించే అవకాశాలున్నట్టు బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది.

అంతేకాకుండా ఆసుపత్రులు, టౌన్‌షిప్, రోడ్లు, హోటళ్ల నిర్మాణంలో పెట్టుబడులను సాధించేందుకు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్(ఎల్ఎల్‌పీ) అనుమతించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాణ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టే మార్గాలను మరింత సరళ తరం చేయనున్నారు. నిర్మాణ రంగంలోకి ఎల్ఎల్‌పీని అనుమతిస్తే విదేశీ పెట్టుబడులు రావడం సులభమవుతుంది.



Next Story

Most Viewed