AP Budget: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ఏమన్నారంటే..?

by  |
AP Budget: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వర్చువల్ విధానంలో ఉభయసభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసగించారు. ఈ సందర్భంగా కొవిడ్ మృతుల కుటుంబాలకు గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి కొవిడ్ ఉధృతి పెరిగిందని గుర్తు చేసిన గవర్నర్.. సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇటువంటి సమయంలో కొవిడ్‌పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆయన సెల్యూట్ చేశారు. ఆరోగ్య శ్రీలో కొవిడ్ చికిత్సను చేర్చామని.. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్‌ తెప్పించామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద 50 శాతం బెడ్లు కేటాయిస్తామని చెప్పారు. అదనంగా కొవిడ్ కేర్ సెంట్లరను కూడా అందుబాటులోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారితో ఏపీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సంక్షేమ పథకాలు మాత్రం నేరుగా లబ్ధిదారులకు చేరాయని గవర్నర్ బిశ్వభూషణ్ వివరించారు.

Next Story

Most Viewed