క్రికెట్ స్టేడియంలోకి ప్రేక్షకులు.. కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా

by  |
క్రికెట్ స్టేడియంలోకి ప్రేక్షకులు.. కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా క్రికెట్ స్టేడియంలకు దూరమైన అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలలో జరిగే ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌ మ్యాచ్‌లకు 50 శాతం మంది ప్రేక్షకులను కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు తెలిపింది. కేంద్ర క్రీడా శాఖ తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. సదరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రికెట్ స్టేడియంలోనికి ప్రేక్షకులను అనుమతించవచ్చని పేర్కొన్నది. దీంతో చెన్నై, పూణే, అహ్మదాబాద్ వేదికగా జరిగే ఇంగ్లాండ్ పర్యటన మ్యాచ్‌లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించేందకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నది. కాగా, ఐపీఎల్ కొత్త సీజన్‌కు సంబంధించి స్టేడియంలను ఇంకా నిర్ణయించక పోవడంతో దానికి సంబంధించిన వివరాలను బీసీసీఐ తెలియజేయలేదు.

నిబంధనలు ఇవే..

– కేంద్ర హోం శాఖ జారీ చేసిన అన్‌లాక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి.
– క్రికెట్ స్టేడియంలలోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తారు. అయితే ప్రతీ ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.
– క్రీడా ప్రాంగణాలు, స్టేడియాల్లో తప్పకుండా సీసీ కెమెరాల నిఘా ఉంచాలి. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద సమూహాలుగా కూడాకుండా చూసుకోవాలి.

Next Story