వారికి గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం.. ఎట్టకేలకు పోస్టులు మంజూరు

by  |
వారికి గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం.. ఎట్టకేలకు పోస్టులు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రైబల్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​లో 339 మంది విద్యావలంటీర్లను ప్రభుత్వం తిరిగి తీసుకోనుంది. 2021‌‌-22 విద్యాసంవత్సరానికి సంబంధించి రెన్యూవల్ చేసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు సర్క్యులర్​ జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సరిపడ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయని మైదాన ప్రాంతాల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసేందుకు వీరిని తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా సంబంధిత జిల్లాల కలెక్టర్లకు రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా పాఠశాలల్లో విద్యార్థుల అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉన్న రెగ్యులర్​ టీచర్లు, ఉన్న ఖాళీల ఆధారంగా విద్యావలంటీర్లను తీసుకోనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవసరానికి మించి టీచర్ల సంఖ్య ఉందని 15 వేల మంది విద్యావలంటీర్లను విధులకు దూరం చేసిన విషయం విధితమే. తాజాగా ట్రైబల్ ​వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 339 మంది విద్యావలంటీర్లను రెన్యూవల్​ చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.

Next Story

Most Viewed