ఆదాయపన్ను రిటర్నుల గడువు పొడిగింపు..

by  |
ఆదాయపన్ను రిటర్నుల గడువు పొడిగింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా పన్ను చెల్లింపులదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పన్ను రిటర్నులను మరోసారి పొడిగించేందుకు నిర్ణయించినట్టు ఆదాయ పన్ను శాఖ బుధవారం వెల్లడించింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నులను జనవరి 10 వరకు దాఖలు చేసుకునేందుకు వెసులుబాటును అందించింది. అలాగే కంపెనీల ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువిస్తూ ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ఇదివరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల కోసం రిటర్నుల దాఖాలుకు డిసెంబర్ 31, కంపెనీలకు జనవరి 30 వరకు గడువిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో గడువు ముగుస్తున్నందున రిటర్నులకు మరింత గడువును ఇచ్చింది. కాగా, ఆదాయ పన్ను రిటర్నుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 29 నాటికి 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed