షర్మిలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

by  |
షర్మిలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ ఆయన సోదరి షర్మిలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సీఎం జగన్ కు షర్మిల కొత్త పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. షర్మిల వైసీపీ లైన్ దాటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిల పార్టీ పెట్టాలని గత మూడు నెలల నుంచి అనుకుంటున్నారని, కానీ తెలంగాణ పార్టీ పెట్టొద్దని, పార్టీ పెడితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో షర్మిలకు వివరించామన్నారు. పార్టీ పెట్టడం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని స్పషటం చేశారు.

“తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో తలెత్తే సమస్యలు వస్తాయని చెప్పాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్ససంబంధాలు కొనసాగాలని జగన్ అభిప్రాయం. కాకపోతే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగకూడదనే షర్మిల అంటున్నారు. ఆమె అభిప్రాయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఒకవేళ షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే ఆ పార్టీకి ప్రత్యేకంగా, పరోక్షంగా మా పార్టీ మద్దతు ఉండదు” అని సజ్జల పునరుద్ఘాటించారు.

ఇక షర్మిలను వైసీపీలో ఎదగనీయడం లేదు. అందుకే సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై సజ్జల మాట్లాడుతూ.. జగన్ అనుమతి ఇచ్చారు కాబట్టే షర్మిల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అయితే షర్మిల పార్టీపై వైసీపీ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed