గ్రామీణ ప్రాంతాలకు గూగుల్ భారీ సాయం

by  |
గ్రామీణ ప్రాంతాలకు గూగుల్ భారీ సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 113 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు తెలిపింది. గూగుల్ దాతృత్వ విభాగం గూగుల్ డాట్ ఆర్గ్ దేశంలో పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో 80 ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఈ నిధులను వినియోగించనున్నట్టు గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అత్యవసరంగా కావాల్సిన గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను గివ్ ఇండియా, పాథ్ అనే స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించనునట్టు తెలిపింది. దీనికోసం గివ్ ఇండియాకు రూ. 90 కోట్లను, పాథ్‌కు రూ. 18.5 కోట్లను ఇవ్వనున్నట్టు వివరించింది. భారత్‌లో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను, ఆరోగ్య కార్యకర్తలను మరింత పటిష్టం చేసేందుకు సంస్థ కృషి చేస్తుందని గూగుల్ ఇండియా హెడ్, వైస్-ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా చెప్పారు.



Next Story

Most Viewed