జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర నష్టం రెట్టింపు

by  |
జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర నష్టం రెట్టింపు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీఎంఆర్ (GMR) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర నష్టం రెట్టింపు స్థాయిలో రూ. 834 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,224 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,206 కోట్లుగా నమోదైంది.

విమానాశ్రయాల విభాగం నుంచి కంపెనీ ఆదాయం రూ. 494 కోట్లుగా నమోదవగా, గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ విభాగం నుంచి వచ్చిన ఆదాయం రూ. 1,460 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ప్రధానంగా ఇంధన రంగం, హైవే విభాగాల్లో నష్టాలు, నికర విలువ క్షీణించడం, రుణాలు-వడ్డీల ఆలస్యం, రుణాలు తీసుకున్నందుకు తక్కువ క్రెడిట్ రేటింగ్ (Credit rating) కారణంగా జీఎంఆర్ గ్రూప్ (GMR Group) నష్టాలను నమోదు చేసినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఆస్తుల్లో వాటాలను విక్రయించడం, ఆర్థిక సంస్థల నుంచి ద్రవ్య సేకరణ, ఇప్పటికే ఉన్న అప్పుల నుంచి రీఫైనాన్సింగ్, ఇంకా ఇతర వ్యూహాత్మక కార్యక్రమాలతో నష్టాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Next Story