చెన్నయిన్, గోవా మ్యాచ్ డ్రా

by  |
Football
X

దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి జీఎంసీ స్టేడియంలో చెన్నయిన్ ఎఫ్‌సీ, గోవా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. టాస్ గెలిచిన గోవా ఫుట్‌బాల్ క్లబ్ కుడి నుంచి ఎడమకు ఆడటానికి నిర్ణయించుకున్నది. ఆట మొదలైన మొదటి నిమిషంలోనే గోవా జట్టు గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నది. 13వ నిమిషంలో చెన్నయిన్ ఆటగాడు జాకుబ్ సిల్వెస్టర్ గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కాగా, చెన్నయిన్ చేసిన పొరపాటుకు 19వ నిమిషంలో గోవాకు పెనాల్టీ లభించింది. ఇగుర్ అంగులో ఎలాంటి తప్పిదం చేయకుండా పెనాల్టీని గోల్‌గా మలచి స్కోర్ 1-1కి సమం చేశాడు.

60వ నిమిషంలో చెన్నయిన్ మిడ్‌ఫీల్డర్ రీగన్ సింగ్ ఇచ్చిన పాస్‌ను లాలిన్‌జులా చాంగ్టే గోల్ గా మార్చాడు. దీంతో చెన్నయిన్ 2-1 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రిఫరీ ఇంజ్యూరీ సమయం మరో నాలుగు నిమిషాలు కలిపారు. ఆ సమయంలో గోవా ఆటగాడు ఆల్బెర్టో నొగురా ఇచ్చిన పాస్‌ను ఇషాన్ పండిత గోల్‌గా మలిచాడు. దీంతో స్కోర్లు 2-2తో సమంగా నిలిచి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆల్బెర్టో నొగురాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ఇషాన్ పండితకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Next Story

Most Viewed