కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వాటిని సృష్టించినవారికి రూ. 5 లక్షలు

by  |
కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వాటిని సృష్టించినవారికి రూ. 5 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్-2021లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకంగా అభివృద్ధి ఆర్థిక మండలి(డీఎఫ్ఐ) ఏర్పాటును ప్రకటించింది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, మెరుగు పరచడం కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్(ఎన్ఐపీ) కింద 2024-25 నాటికి 7,000 ప్రాజెక్టులలో రూ. 1.11 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ పథకానికి అనువుగా ఉండే పేరుతో పాటు ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీగా బహుమతులను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రారంభించిన డీఎఫ్ఐ పనితీరు, లక్ష్యాలను స్పూరించేలా పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను పోటీదారులు ఆగష్టు 15 సాయంత్రం నాటికి పంపించాలని ఆర్థిక శాఖ వెల్లడించింది. డీఎఫ్ఐ కార్యకలాపాలను సూచించేలా లోగో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పోటీల్లో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన ముగ్గురికి రూ. 5 లక్షలు చొప్పున మొత్తం రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో ఉన్న వారికి రూ. 2 లక్షల చొప్పున నగదు బహుమతి ఉంటుందని ఆర్థిక శాఖ వివరించింది. డీఎఫ్ఐకి సంబంధించి తేలికంగా అర్థమయ్యే విధంగా, పలికేందుకు సులువుగా ఉండే పేరు, ట్యాగ్, లోగోలు ఉండాలని పేర్కొంది. వీటికి సంబంధించిన ఎంట్రీలను ప్రభుత్వ వెబ్‌సైట్‌కు పంపించాలని, త్వరలోనే ఆ వెబ్ సైట్ వివరాలను తెలియజేస్తామని వెల్లడించింది.

Next Story

Most Viewed