క్రికెట్ టీమ్ నుంచి స్ఫూర్తి పొందండి : ప్రధాని మోడీ

by  |
క్రికెట్ టీమ్ నుంచి స్ఫూర్తి పొందండి : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై విజయం సాధించిన ఇటీవల విజయాన్ని ఉటంకిస్తూ భారత క్రికెట్ టీం నుంచి స్ఫూర్తి పొందాలని అసోంలోని తేజ్‌పుర్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన చేశారు. గాయాలు, అనుభవలేమి భారత యువ క్రికెట్ జట్టు స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయని, అత్యుత్తమ జట్టుల్లో ఒకటైన కంగారూలను ఓడించకుండా ఆపలేకపోయాయని గుర్తుచేశారు. అసోంలోని తేజ్‌పుర్ యూనివర్సిటీలో జరిగిన 18వ స్నాతకోత్సవం జరిగింది. ఇందుకు హాజరైన సుమారు 1200 మంది విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి ప్రసంగించారు. స్వయం సమృద్ధ భారతావని కోసం విద్యార్థులు కృషి చేయాలని, 100వ స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నప్పుడు ఈ విద్యార్థుల శ్రమనూ ప్రజలు ప్రశంసించేలా ఎదగాలని తెలిపారు. భవిష్యత్‌లో యూనివర్సిటీలన్నీ ఆన్‌లోన్‌లో బోధనలు జరుపుతాయని, అందుకు అనుగుణంగా భారత విద్యా విధానాన్ని రూపొందించామని అన్నారు. ‘స్వాతంత్ర్య సమరంలో అసోం నుంచి అనేకులు ప్రాణాలకు తెగించి పోరాడారు. అమరులయ్యారు. కానీ, మీరు ఆత్మ నిర్భర్ భారత్‌ కోసం జీవించాల’ని తెలిపారు.

Next Story

Most Viewed