కరోనా వేళ అధికారుల నిర్లక్ష్యం.. పడకేసిన పారిశుద్ధ్యం

by  |
కరోనా వేళ అధికారుల నిర్లక్ష్యం.. పడకేసిన పారిశుద్ధ్యం
X

దిశ, కరీంనగర్ సిటీ :నగరంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లపక్క ఉన్న చెత్త నిత్యం తొలగించకపోవడంతో కుప్పలు తెప్పలుగా దర్శనమి స్తున్నాయి. పలుచోట్ల గుట్టలుగా పేరుకుపోవటంతో తీవ్ర దుర్గంధంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పల సమీపంలోనే కూరగాయల మార్కెట్లు నిర్వహిస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయల క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. పదిహేను రోజులకు ఒకసారి చెత్త తొలిగిస్తున్నా సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్ లు కానీ పట్టించుకోవడం లేదని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, స్థానికులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం, వారి పని తనానికి నిదర్శమని పరిసర ప్రాంతాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు కరోనా మళ్లీ విలయతాండవం చే స్తుండడం, మరోవైపు అపరిశుభ్ర వాతావరణం , చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండగా, స్థానికులు భయబ్రాంతులకు గుర వుతున్నారు. వివిధ పనుల నిమిత్తము ఆయా ప్రాంతాల నుంచి వెళ్లాలంటే జంకుతున్నారు. ప్రధానంగా బస్ స్టాండ్ వెనుకవైపు, అంబేద్కర్ స్టేడియం మెయిన్ గేట్ పక్కన, కోర్టు ఎదురుగా, ఎస్సారార్ కళాశాల ఎదుట కొనసాగుతున్న కూరగాయల విక్రయాలతో, చెత్త జమ అవుతుంది. ప్రతీ రోజు చెత్త తొలగించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. వేసవి కావడంతో నిత్యం వాకింగ్‌కు వెళ్లేందుకు అటువైపు నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటయిలర్లు చెత్త కుప్పలు, దుర్వాసన మధ్యనే కూరగాయలు విక్రయిస్తున్నారు.

ఇదంతా అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మార్కెట్ జరుగుతున్నా పట్టించుకోరా అని అధికారులను ప్రశ్నిస్తు న్నారు . ముఖ్యనేతల పర్యటన సమయంలో హడావుడి చేసే అధికారులు , కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను ప్రతి రోజూ తొలగించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులు, వీఐపీలు వచ్చినప్పుడే శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం చేస్తారని , తర్వతా షరా మామూలేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ నాలాల పక్కనే కూరగాయలు విక్రయిస్తూ, వ్యర్ధాలు నాలాలో వేస్తుండగా, భరించలేని దుర్వాసన వస్తుండటంతో పాటు, దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు . ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రతి రోజూ చెత్తను తొలగించాలని నగర వాసులు కోరుతున్నారు.


Next Story

Most Viewed