టీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడి‌గా గద్దల రామకృష్ణ

by  |
టీఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడి‌గా గద్దల రామకృష్ణ
X

దిశ, అశ్వాపురం : టీఆర్ఎస్ పార్టీ అశ్వాపురం మండల యువజన అధ్యక్షుడుగా గద్దల రామకృష్ణను నియమిస్తున్నట్లు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం ప్రకటించారు. రామకృష్ణ ప్రస్తుతం టీఆర్ఎస్‌లో అశ్వాపురం మండలం ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్నాడు. యూత్ అధ్యక్షుడుగా దళిత యువకుడికి అవకాశం ఇవ్వడం పై మండలంలోని దళితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకుల సహకారంతో మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కు కృషి చేస్తానన్నారు.


Next Story