స్విస్ పర్వతాల మీద భారత పతాకం

by  |
స్విస్ పర్వతాల మీద భారత పతాకం
X

దిశ, వెబ్‌డెస్క్: కష్టసమయాల్లో తోటి దేశానికి తాము అండగా ఉన్నామని సూచిస్తూ బతుకు మీద ఆశలను కల్పించే ఉద్దేశంతో స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ పర్వతాల్లోని మాటర్‌హార్న్ శిఖరం మీద భారత జాతీయ పతాకం ఆవిష్కృతమైంది. 14,692 అడుగుల ఈ శిఖరం మీద లేజర్ లైట్ల ద్వారా త్రివర్ణ పతాకాన్ని స్విట్జర్లాండ్ దేశం ప్రదర్శించింది.

విశ్వవ్యాప్తంగా 1,50,000ల మంది మరణానికి కారణమైన కరోనా వైరస్ కోరల్లో నుంచి తోటి దేశం త్వరగా కోలుకోవాలనే తమ ఆశకు ప్రతీకగా స్విట్జర్లాండ్ దేశం ఈ ప్రదర్శన చేపట్టింది. జాతీయ పతాకంతో వెలిగిపోతున్న మాటర్‌హార్న్ శిఖరం ఫొటోను ప్రధాని నరేంద్రమోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రపంచమంతా కొవిడ్ 19కి వ్యతిరేకంగా పోరాడుతోంది. మానవాళి ఈ మహమ్మారి నుంచి కచ్చితంగా కోలుకుంటుందని ప్రధాని పోస్ట్ చేశారు. గత వారం రోజుల నుంచి ఈ శిఖరం మీద కొవిడ్ 19కి సంబంధించిన ఏదో ఒక అవగాహన సమాచారాన్ని లేజర్ లైట్ల ద్వారా ప్రదర్శిస్తూనే ఉన్నారు.

Tags: Corona, covid, Virus, Swiss, Switzerland, India, Tricolor, solidarity



Next Story

Most Viewed