విద్యుత్ ఉద్యోగుల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ సెంటర్స్..

by  |
ts-jenco 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులకు కొవిడ్ వాక్సినేషన్ అందించే ప్రక్రియ సోమవారం మొదలైంది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో ఏర్పాటు చేసిన స్పెషల్ వాక్సినేషన్ కేంద్రాన్ని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యుత్ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రకటించడమే కాకుండా టీకా అందించినట్లు ఆయన చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ చొరవతో దాదాపు యాభై వేల మంది విద్యుత్ ఉద్యోగులందరికీ వాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు ఎలాంటి అపోహలు లేకుండా వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. మొదటి డోస్ తీసుకున్న వారు విధిగా 28 రోజుల తరవాత రెండో డోసును కూడా తీసుకోవాలన్నారు.

అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులందరికీ టీకా అందించడం అసాధారణ విషయమని అన్నారు. కానీ, అది జరిగేలా కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీకా అందించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఉద్యోగులు వాక్సిన్ వేసుకున్నా కూడా విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగుల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడంపై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రత్నాకర్ రావు, సదానందం, సభ్యులు, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య హర్షం వ్యక్తంచేవారు. తమకు టీకా అందించిన ప్రభుత్వానికి, ఇందుకు సహకరించిన సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. రెండు వారాల్లోగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ఉద్యోగులంద‌రూ వ్యాక్సిన్ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో మెడికల్ ఆఫీసర్ పావని, డైరెక్టర్లు టీ శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, కే రాములు, జీ పర్వతం, నరసింహరావు, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed