సూపర్ ఆఫర్ : ప్లాస్టిక్ ఇస్తే.. మీల్స్ ఫ్రీ

by  |
సూపర్ ఆఫర్ : ప్లాస్టిక్ ఇస్తే.. మీల్స్ ఫ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ కంటే ముందు నుంచే ప్లాస్టిక్ పెనుభూతంలా మానవాళిని వెంటాడుతోంది. ప్లాస్టిక్ వాడొద్దని, ఒకవేళ వాడితే జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా..వాడకం తగ్గడం లేదు. రోజురోజుకూ ఇంకా పెరుగుతోంది. తద్వారా పర్యావరణంపై తీవ్రప్రభావం పడుతోంది. కాగా, ఎంతోమంది యువకులు, పర్యావరణ ప్రియులు ప్లాస్టిక్​ నిర్మూలన కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ​ మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు ‘ప్లాస్టిక్ లావో ఖానా ఖిలావో’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రారంభించారు. నజాఫ్‌గర్ జోన్‌లో తొలి ‘గార్బేజ్ కేఫ్’ ఓపెన్ చేయగా..తాజాగా మరో 23 గార్బేజ్ కేఫ్‌లు ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగమయ్యాయి.

సాధారణంగా రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ చెత్తను ఏరి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో తమ కడుపు నింపుకుని జీవనం సాగించేవాళ్లను మనం చూస్తూ ఉంటాం. వాళ్లు ఎండ, వానలను తట్టుకుని రోజంతా శ్రమిస్తే వాళ్లకు దొరికేవి గుప్పెడు మెతుకులు. వారు ఇకపై వాటర్ బాటిల్స్, మూతలు, డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ చెత్తను కిలో సేకరిస్తే చాలు వాళ్లకు కడుపునిండా భోజనం దొరుకుతుంది. వాళ్లే కాదు ఎవరైనా సరే కిలో ప్లాస్టిక్ సేకరించి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ‘గార్బేజ్ కేఫ్’లలో అందించి మీల్స్ /టిఫిన్/ డిన్నర్ కూపన్స్ తీసుకోవచ్చు. ఢిల్లీ వ్యాప్తంగా ఈ తరహా కేఫ్‌లు 23 ప్రారంభించగా (సౌత్ జోన్-12, సెంట్రల్ జోన్-10, వెస్ట్ జోన్-1) ఇదో యూనిక్ ఇన్షియేటివ్ అని మున్సిపల్ ఆఫీసర్లు తెలిపారు. 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికపూర్‌లో దేశంలో తొలి గార్బేజ్ కేఫ్ ప్రారంభమైంది. అక్కడ చెత్త సేకరించి అందిస్తే మీల్స్‌తో పాటు పేదలకు షెల్టర్ కూడా ఇస్తారు. ఇలా సేకరించిన 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్స్‌తో అక్కడ రోడ్డు వేశారు. ఈ రోడ్లు సాధారణ రోడ్ల కంటే మన్నికగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed