ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

by  |
training
X

దిశ నేరడిగొండ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు ఉన్నాయి అని నేరడిగొండ మండల యం.పి.డి.ఓ అబ్దుల్ సమద్ ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం 8వ తరగతి/10వ తరగతి లేదా అపైన విద్యా అర్హత కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడిన/జనరల్/బిసి/ఎస్సీ/మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు భారత్ డైనమిక్ లిమిటెడ్ (బిడిఎల్) హైదరాబాద్ వారి సామాజిక బాధ్యత లో భాగంగా వస్తున్న నిధులతో ఉచిత మిషన్ ఆపరేటింగ్, ప్లాస్టిక్ ప్రోసెసింగ్ (ఏంఓ-పిపీ) శిక్షణ కోర్సులను అందిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో భోజనం, వసతి, యూనిఫాం, సేఫ్టీ షు, మరియు కోర్సు మెటీరియల్ ఉచితంగా అందిస్తామన్నారు. శిక్షణ అనంతరం పేరెన్నిక గల ప్లాస్టిక్ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఆసక్తి గల అభ్యర్థుల నుండి ఈ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇతర వివరాలకు సీపెట్, ఐడిఏ ఫేజ్-2 చర్లపల్లి లేదా శ్రీ ఎస్. గోవింద్ ఫోన్ నెంబర్ 9959333417/418, గానీ,విజయ్ కుమార్ ఫోన్ 9849599133 నంబర్ లో సంప్రదించగలరు.

Next Story

Most Viewed