పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్.. ఎక్కడో తెలుసా?

by  |
Path Pradarshak
X

దిశ, ఫీచర్స్ : నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో తెలియంది కాదు. సొంతంగా ప్రిపేరై, జాబ్ పొందే రోజులు కావివి. ఈ క్రమంలో ఉద్యోగార్జనకు కోచింగ్ అనేది తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ ఉద్యోగాన్వేషణకు బయలుదేరే యూత్ సంఖ్య పెరుగుతుందే కానీ, ఉద్యోగాలు మాత్రం పెరగడం లేదు. దీంతో ఒక్క పోస్టు కోసం వందలు, వేల మంది పోటీపడుతుండగా.. తమకు కావాల్సిన వ్యక్తులను ఎంచుకునేందుకు రిక్రూటింగ్ సంస్థలు పోటీ పరీక్షలను మరింత కఠినతరంగా రూపొందిస్తున్నాయి. కాగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్థోమతలేక, పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.

‘పథ్ ప్రదర్శక్(path pradarshak)’ ప్రాజెక్టులో భాగంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్నారు. యూత్ తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సర్కారు వారికి తోడ్పడుతుందని సీఎం యోగి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభ్యుదయ యోజన(MAY)లో భాగంగా ఈ ప్రాజెక్టు కింద యువతకు కోచింగ్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు కాంపిటీటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్‌కు ఆన్‌లైన్ వేదికగా ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయనున్నారు. ఆన్‌లైన్ బేసిస్‌లో నిర్వహించే ఈ తరగతుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అభ్యర్థులకు సూచనలు ఇవ్వనున్నారు.

Next Story

Most Viewed