దేశీయ మార్కెట్లలో పెరుగుతున్న ఎఫ్‌పీఐ పెట్టుబడులు!

by  |
fpi
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగష్టు నెలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్లలో రూ. 7,245 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నికర పెట్టుబడులు క్రమంగా పెరుగుతుండటం మదుపర్ల జాగ్రత్త వైఖరిని సూచిస్తుందని, భారత మార్కెట్లలో నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

తాజా డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఆగష్టు 2-20 మధ్య విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీలలో రూ. 5,001 కోట్లను, డెట్ విభాగంలో రూ. 2,244 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. భారతీయ ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా విశ్వాసాన్ని కలిగి ఉందని, ఇటీవల ఆర్థిక గణాంకాలు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటంతో ఎఫ్‌పీఐలు పెరుగుతున్నాయని శ్రీవాస్తవ వివరించారు.

Next Story

Most Viewed