స్వల్పంగా తగ్గిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు

by  |
స్వల్పంగా తగ్గిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కరోనా పరిణామాల నేపథ్యంలో దేశంలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) మార్చి నెలలో కొంత నెమ్మదించాయి. మార్చి నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల ద్వారా రూ. 8,642 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు డిపాజిటరీల గణాంకాలు వెల్లడించాయి. మొత్తం రూ. 14,202 కోట్లు ఈక్విటీ మార్కెట్లకు వచ్చాయని, మార్చి 1-19 మధ్య డెట్ మార్కెట్ల నుంచి రూ. 5,560 కోట్లు వెనక్కి వెళ్లినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. దీంతో రూ. 8,642 కోట్లు నికర ఎఫ్‌పీఐలు వచ్చాయి. ఇంతకుముందు జనవరిలో నికర ఎఫ్‌పీఐలు రూ. 14,649 కోట్లు రాగా, ఫిబ్రవరిలో రూ. 23,663 కోట్లు భారత్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

‘ఇటీవల దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారని, అనంతరం మార్కెట్లో అస్థిరత, దిద్దుబాటు నేపథ్యంలో దేశీయంగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు వచ్చి చేరినట్టు’ మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. అంతేకాకుండా యూఎస్‌లో భారీగా ఉద్దీపన పథకానికి ఆమోదం రావడంతో అమెరికాలో ద్రవ్య లభ్యత పెరిగింది. ఇది కూడా భారత్‌లో ఎఫ్‌పీఐల పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా, ఆసియాలో మన దేశం మినహా అన్ని దేశాల నుంచి ఎఫ్‌పీఐలు వెనక్కి వెళ్తున్నాయి.



Next Story