మాజీ సీఎం పేరు లేకుండానే అభ్యర్థుల లిస్ట్.. పుదుచ్చేరి ముఖ్యమంత్రికి షాకిచ్చిన కాంగ్రెస్

by  |
v. Narayana swamy
X

దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాజాగా ప్రకటించిన ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఆయనకు స్థానం కల్పించలేదు. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇన్‌చార్జి దినేశ్ గుండురావ్ ఆదివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. నారాయణ స్వామిని ఎన్నికల బరిలోనుంచి తప్పించడంపనై ఆయన స్పందిస్తూ.. ‘ఈ ఎన్నికల్లో వి. నారాయణ స్వామి పోటికి దిగడం లేదు. కానీ ఆయన ఎన్నికల ప్రచారం, నిర్వహణ చూసుకుంటారు’ అని తెలిపారు.

ఏప్రిల్ 6న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 14 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్.. ఆ పార్టీకి 13 సీట్లను కేటాయించింది. కాంగ్రెస్ 15 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఇతరులకు 2 స్థానాలలో పోటికి దిగుతున్నారు. ఇదిలాఉండగా బీజేపీ కూడా తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.

కాగా కాంగ్రెస్ గత పాలనపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఉండటం.. సీఎంపై అవినీతి ఆరోపణలు, ఆయన పాలనపై సొంత పార్టీ నేతలు కూడా విమర్శించడంతో నారాయణస్వామిని తప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతనెలలో స్వయంగా రాహుల్ గాంధీ పాల్గొన్న ఓ సభలో ఒక మహిళ నష్టపరిహారం గురించి సీఎంను నిలదీయగా.. ఆయన మాత్రం దానిని తనకు అనుకూలంగా చెప్పినట్టు చెప్పుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed