- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గెలిచే సీటు నీ బిడ్డకు.. ఓడిపోయే సీటు పీవీ బిడ్డకా?’
దిశ, శేరిలింగంపల్లి: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి గరికపాటి మోహన్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అటు విద్యార్థులను, ఇటు ఉద్యోగస్థులను దెబ్బతీశారని అన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ యువతను నిరుద్యోగులుగా మర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా మాజీ ప్రధాని పీవీపై కేసీఆర్‌కు అంత ప్రేమ ఉంటే.. గెలిచే సీటు(నిజామాబాద్) తన బిడ్డకు ఇచ్చి, ఓడిపోయే సీటును పీవీ బిడ్డకు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో దేవి ప్రసాద్‌ను ఓడించి కేసీఆర్ అహంకారాన్ని బద్దలుకొట్టిన గ్రాడ్యూయేట్‌లు ఈసారీ అదేపంథా కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, కేసీఆర్ తన కపట బుద్దిని మరోసారి రుజువుచేస్తూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవిని బలిపశువును చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్చి 1 నుంచి 12 వరకు ఓటర్ సమ్మేళనాలు కొనసాగుతాయని, ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరు బాధ్యత వహిస్తారని అన్నారు. ఎన్నికల తేదీ వరకూ ప్రతి ఓటరును కనీసం ఐదుసార్లు కలిసేలా వీరు చొరవ చూపాలని సూచించారు. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో మెజారిటీ వచ్చిందని, ఈసారి అంతకు మించిన ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.