ఆరోజు రాత్రి అడవిలో ఏం జరిగింది

by  |
ఆరోజు రాత్రి అడవిలో ఏం జరిగింది
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండల పరిధిలోని ఈనెల 27న అటవీశాఖ అధికారులు అచ్చంపేట మండలం పలుగు తండ కు చెందిన 18 లంబాడ గిరిజనులు అడవిలో నిద్రిస్తుండగా దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

ఆ రోజు రాత్రి అడవిలో ఏం జరిగింది…

అచ్చంపేట మండలం పలుగు తండాకు చెందిన సుమారు 20 మంది లంబాడా గిరిజనులు అడవిలో దొరికే ఇప్పపూల సేకరణ కోసం తండాకు చెందిన లంబాడా గిరిజనులు అడవికి వెళ్లారు. ఈ క్రమంలో అటవీ శాఖకు సంబంధించిన ఫైర్ ప్రొటెక్షన్ టీం అడవిలో సంచరిస్తుండగా గార్ల బోర్డు పడే లు వద్దా లంబాడా గిరిజనులు నిద్రిస్తున్న వారి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గిరిజనులతో మాట్లాడుతూ రిజర్వు అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా ఎవరు సంచరించ రాదని, క్రూర మృగాలు దాడి చేస్తే పరిస్థితి ఏంటని, ఎక్కడనుండి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు… అనే కోణంలో ఆ గిరిజనులతో సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో లంబాడా గిరిజనులు ఇప్పపూల సేకరణ కోసం వచ్చామని చెబుతూ ఆందోళన చెందింది వాస్తవం.
మీరు అడవిలో ఉండకూడదని, వారిని బెదిరిస్తూ అడవి నుండి మన్ననూర్ బేస్ క్యాంపు వద్దకు తరలించే ప్రయత్నం అటవీశాఖ అధికారులు చేశారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన కొందరు లంబాడా గిరిజనులు వారి నుండి తప్పించుకునే క్రమంలో పారిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో చీకటిలో పారిపోతున్న క్రమంలో కొందరికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. దీనిని సాకుగా తీసుకున్న గిరిజనులు అటవీ శాఖ అధికారులు మాపై కర్రలతో, గొడ్డలితో దాడి చేసి గాయపరచి నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే వారిని అడవి నుంచి తరలించే క్రమంలో ఇద్దరు ముగ్గురి పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంబాడా గిరిజనులలపై అటవీశాఖ అధికారులు మా పై విచక్షణారహితంగా దాడులు చేశారని, మహిళలు అని చూడకుండా చెప్పకూడని ప్రదేశాలలో గాయపరిచారని బాధితులు ఆరోపిస్తున్నారు. లంబాడా గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన తీరు పై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు ఆ రోజు రాత్రి బాధిత లంబాడా గిరిజనులతో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్ వాట్సప్ ద్వారా సోషల్ మీడియాకు విడుదల చేశారు.

అమాయక ఆదివాసీ ఉద్యోగులను బలి చేసే కుట్ర….

నల్లమల్ల ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులకు అడవిలో లభించే అటవీ ఉత్పత్తులపై సర్వ హక్కులువారికే ఉంటాయి. గత దశాబ్ద కాలం పైగా అటవీ ఉత్పత్తులు తగ్గుముఖం కావడానికి కూడా… మైదాన ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు కానటువంటి వారు మా హక్కులను కాలరాస్తూ మాకు జీవనోపాధిగా ఉంటున్నా కొద్దిపాటి ఉత్పత్తులను అక్రమంగా దోచుకుంటూ మా ఆదివాసి గిరిజనులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 27 ముందు రోజున లంబాడా గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన సందర్భంలో ఆ లంబాడాగిరిజనులపై అడవి శాఖ అధికారులు దాడి చేస్తే సహించరాని విషయమని ఆదివాసీ నాయకులు ఖండిస్తున్నారు.

సమగ్ర న్యాయ విచారణ వాస్తవాలు బయటకు

అటవీ అధికారులు మేము గిరిజనుల పై దాడి చేయలేదని ఆరోపిస్తున్నారు. మరోపక్క బాధిత లంబాడా గిరిజనులలపై అటవీశాఖ అధికారులు మా పై విచక్షణారహితంగా దాడులు చేశారని, మహిళలు అని చూడకుండా చెప్పకూడని ప్రదేశాలలో గాయపరిచారని బాధితులు ఆరోపిస్తున్నారు. లంబాడా గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన తీరు పై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు.

వాస్తవానికి ఆరోజు రాత్రి ఏం జరిగి ఉంటుందనే విషయం బయటకు రావాలంటే ఉన్నతస్థాయి న్యాయమూర్తి చేత సమగ్ర న్యాయ విచారణ చేపడితే గాని అసలు విషయాలు బయటకు వస్తాయని ఆదివాసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు బాధిత బాధితుల పక్షాన గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంఘటనలో ఆదివాసీ చెంచు గిరిజనులు లేరని…. కాని లంబాడా గిరిజనులు గాయపడితే చెంచు గిరిజనుల పేరును వాడుకొంటూ బాధితులు కుట్ర చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అటవీశాఖ అధికారులు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు పన్నుతున్నారని, లేక లంబాడా గిరిజనులు వారి పొరపాట్లను సమర్థించుకోవడానికి అటవీశాఖ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారా… అనే కోణంలో తేలాల్సి ఉన్నది. పై అనుమానాలు పోవాలంటే న్యాయ విచారణ తోనే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed