ఆ చెట్టు నరికినందుకు.. రూ.62 వేల ఫైన్

by  |
ఆ చెట్టు నరికినందుకు.. రూ.62 వేల ఫైన్
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో భారీ వేప చెట్టును నరికేసిన వ్యక్తులకు అటవీ శాఖ అధికారులు రూ.62 వేల జరిమానా విధించారు. ఓ విద్యార్థి ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు విచారణ చేపట్టారు. వివరాళ్లోకి వెళితే.. సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉందనే కారణంగా దాదాపు 40 ఏళ్ల వయస్సు ఉన్న వేప చెట్టును రాత్రికి రాత్రే నరికేశారు. ఆనవాళ్లు కన్పించకుండా కలపను తరలించారు. అంతేగాకుండా చెట్టు నరికినట్టు గుర్తించకుండా ఉండేందుకు మొదళ్లను తగుల బెట్టారు. ఇది గమనించిన ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి, అటవీ శాఖ అధికారులకు 1800 425 5364 నెంబర్ ద్వారా ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అటవీశాఖ అధికారులు బాలుడి ఫిర్యాదుపై విచారించారు. విచారణ చేపట్టి.. చెట్టు నరికింది నిజమని తేలడంతో సంబంధిత వ్యక్తులకు రూ.62,075 జరిమానా విధించినట్టు హైదరాబాద్(ఈస్ట్) ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వయస్సులోనే బాధ్యతాయుతంగా వ్యవహారించిన ఆ విద్యార్థిని అధికారులు అభినందించారు.



Next Story

Most Viewed