ఓ అడవి బిడ్డ ఆవేదన.. ఫారెస్ట్ అధికారులే మమ్మల్ని దోచుకుంటున్నారు

by  |
ఓ అడవి బిడ్డ ఆవేదన.. ఫారెస్ట్ అధికారులే మమ్మల్ని దోచుకుంటున్నారు
X

దిశ, మల్లాపూర్ : ఫారెస్ట్ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఓ అడవి బిడ్డ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ భూమిలో ఉన్న సంపదను కొందరు అక్రమార్కులతో కలసి కొల్లగొడుతున్నారని ఆరోపించాడు. తమ భూముల్లోని కలపను అన్యాయంగా నరికివేస్తున్నారని గిరిజన బిడ్డలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి వెంకటరావుపేట గ్రామంలో 72 మంది గిరిజనులు ఒక్కొక్కరికి కలిపి 22 గుంటల భూమి ఉందని.. 1970 నుంచి తమ పేరుతో కొనసాగుతోందని.. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 2018 సంవత్సరంలో తమకు పట్టాలు కూడా ఇచ్చారని చెప్పాడు.

మా భూముల్లో పెరిగిన కలపను కొందరు అక్రమార్కులు ఫారెస్ట్ అధికారులతో కుమ్మక్కై తమ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నాడు. ఏపుగా పెరిగిన వందలాది చెట్లను నరికి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకున్నారని తెలిపాడు.తమకు న్యాయం చేయాల్సిన ఫారెస్ట్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. తాము సాగు చేసుకుంటున్న భూములు మావి కాదని ఫారెస్ట్ అధికారులు ఒకవేళ సందేహం ఉంటే క్రాస్ ఎంక్వైరీ చేసుకోవచ్చని.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై తమ భూములలో ఉన్న కలపను అక్రమంగా నరికి వేస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించాడు. తమ భూముల్లో మొక్కలు నాటి పెంచి పెద్ద చేసిన కలపను తమ అనుమతి లేకుండా నరికివేసి తమను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని విమర్శించాడు. అందుకు తగిన నష్టపరిహారం ఫారెస్ట్ ఆఫీసర్ లే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల అధికారులతో భేటీకి దిగాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.

Next Story

Most Viewed