పుంజుకుంటున్న ఫుడ్‌ట్రక్ బిజినెస్

by  |
పుంజుకుంటున్న ఫుడ్‌ట్రక్ బిజినెస్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి చూపులు’ సినిమా చూసే ఉంటారు కదా.. అందులో హీరో, హీరోయిన్ కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టి సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు అదే ఐడియాను ఎంతో మంది యువత ఫాలో అవుతున్నారు. కరోనా పాండమిక్ తర్వాత రెస్టారెంట్లు తెరుచుకుంటున్నప్పటికీ చాలా మంది వెళ్లడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ వెళ్లినా సంకోచిస్తున్నారు. బయట తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ పనులు పునఃప్రారంభమయ్యాయి కాబట్టి అందరూ ఆఫీసులకు వెళ్తున్నారు. అయితే వాళ్లకు ఎక్కడ తినాలో తెలియడం లేదు.

అందుకే తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఫుడ్ ట్రక్‌లు పుట్టుకొస్తున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో ఈ ఫుడ్‌ట్రక్ బిజినెస్ బాగా నడుస్తోంది. దీనికి పెట్టుబడి, నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, శుభ్రత పాటించడం కూడా సులభమవడంతో హోటల్‌కు ఉన్నన్ని నిబంధనలు ఫుడ్ ట్రక్‌కు లేవు. ఒకరో ఇద్దరో అక్కడే భోజనం చేసినా ఎక్కువ మంది పార్శిల్ తీసుకెళ్లడానికే ఆసక్తి చూపిస్తారు.

అంతేకాకుండా కొత్తగా వెలుస్తున్న ఈ ఫుడ్‌ ట్రక్‌లన్నీ ప్రధాన రహదారుల్లో కాకుండా గల్లీలు, వీధి సందుల్లో ఉంటున్నాయి. ఇంటి నుంచి తక్కువ దూరంలో ఉండటం కూడా ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ వృద్ధికి ఊతంగా మారింది. ఒకే వంటకానికి పరిమితమై పేరు తెచ్చుకుంటున్న ఫుడ్ ట్రక్‌లు చాలా పాపులర్ అవుతున్నాయి. అందుకు తోడు ఈ ఫుడ్ ట్రక్‌ల ఫుడ్‌ను పాపులర్ చేయడానికి ఇంటర్నెట్ కూడా ఉంది. అందుకే వచ్చిన వారితో ఫొటో దిగి సోషల్ మీడియాలో ట్యాగ్‌లు చేయించుకుని కూడా బిజినెస్‌ను పెంచుకుంటున్నారు. పది లక్షల రూపాయల పెట్టుబడితో ఒక మంచి ఫుడ్ ట్రక్ ప్రారంభించి కోటిన్నర లాభం పొందుతున్నవారు కూడా ఉన్నారు.

ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టడానికి ట్రక్, బేస్ కిచెన్, స్టాఫ్, తిప్పాల్సిన లొకేషన్‌ల గురించి ఐడియా ఉంటే సరిపోతుందని ఢిల్లీకి చెందిన దోశె ఐఎన్‌సీ యజమానురాలు జ్యోతి అంటున్నారు. అంతేకాకుండా ఈ బిజినెస్‌కు పర్మిషన్‌లు కూడా చాలా సులభంగా దొరుకుతాయని, సరైన సమయానికి సరైన ప్రదేశాన్ని గుర్తించగలిగితే లాభం కచ్చితంగా వస్తుందని ఆమె చెబుతున్నారు. ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న యువత ఎవరైనా ఉండి, వంటల మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టుకుంటే ఈజీగా సక్సెస్ కావొచ్చు.

Next Story

Most Viewed