ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈటలకు భారీ షాక్

by  |
ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈటలకు భారీ షాక్
X

దిశ, జమ్మికుంట: హుజురాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉప ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్‌కు భారీ షాక్ తగిలింది. నిన్నటివరకు ఈటల రాజేందర్ మా నాయకుడంటూ.. టీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన ఇల్లందకుంట మండలంలోని ఎంపీపీ, ముగ్గురు సర్పంచులు, ఒక ఎంపీటీసీ టీఆర్ఎస్‌లో చేశారు. మండలానికి చెందిన ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, సిరిసేడు, మర్రివానపల్లి, రాచపల్లి సర్పంచులు మహమ్మద్ రఫీ ఖాన్, కళాల రాజిరెడ్డి, బూస ఆదిలక్ష్మి, టేకుర్తి ఎంపీటీసీ మోట పోతుల ఐలయ్యలు మంగళవారం రాత్రి ఇల్లందకుంట ఇంచార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

TRS-Leaders

మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన నాటి నుండి ఈటలకు అండగా నిలుస్తూ.. సమయం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన వీరంతా టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఈటలకు భారీ షాక్ అని చెప్పొచ్చు. కాగా, వీరంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అంతేగాకుండా ఆ పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించడం హర్షనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని వారు వెల్లడించారు.

Next Story

Most Viewed