‘సింగపూర్ తరహాలో భారత్‌లోనూ క్రిప్టో కరెన్సీ నియంత్రణ అవసరం’

by  |
‘సింగపూర్ తరహాలో భారత్‌లోనూ క్రిప్టో కరెన్సీ నియంత్రణ అవసరం’
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో క్రిప్టోకరెన్సీని నియంత్రించడంలో సింగపూర్ మాదిరి నమూనాను ప్రభుత్వం అనుసరించాలని ఓ కమిటీ కోరింది. క్రిప్టో కరెన్సీ, క్రిప్టో అసెట్స్‌కు సంబంధించి నియంత్రణకు కార్యచరణను రూపొందించడంతో పాటు పలు భిన్న మార్గాలను అనుసరిస్తూ పరిష్కారాలను కనుకొనాలని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), బ్లాక్‌చైన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్(బీఏసీసీ) సభ్యులు ఓ వెబినార్‌లో తెలిపారు. ‘అభివృద్ధి చెందుతున్న క్రిప్టో నియంత్రణ ముసాయిదా-భారత్, సింగపూర్ అభివృద్ధి’ కార్యక్రమంలో పలువురు నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వజీర్ ఎక్స్ సీఈఓ శ్రీ నిశ్చల్ శెట్టి.. దాదాపు 1.5 కోట్ల మంది దేశీయంగా రూ. 1,500 కోట్ల విలువైన క్రిప్టో ఆస్తులను కలిగి ఉన్నారు.

భారత్ ఇక ఎంతమాత్రం చిన్న మార్కెట్ కాదు, అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక మార్కెట్‌గా మారుతోంది. క్రిప్టోను అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతున్నప్పటికీ, క్రిప్టో స్టార్టప్స్ పరంగానే కాకుండా నియంత్రణ విషయంలోనూ వెనకబడి ఉన్నాం. క్రిప్టో టెక్నాలజీ కోసం దేశీయ వ్యాపారవేత్తలను అభివృద్ధి చేయాల్సి ఉందని’ చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో సింగపూర్ తన చెల్లింపుల సేవల చట్టంలో మార్పులు చేసింది. అందులో క్రిప్టో కరెన్సీ విషయంలో మార్పిడి, నిల్వను సులభతరం చేసే సంస్థలు పనిచేసేందుకు లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపింది.

సింగపూర్‌లో క్రిప్టోకు సంబంధించి అక్కడి సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన నియమాలు, నిబంధలకు లోబడి ఉంటుంది. ఈ రకమైన విధానాలను భారత్ కూడా అనుసరించడం మంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘భారత్‌తో పాటు సింగపూర్ కూడా ఫిన్‌టెక్ పరిశ్రమకు హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. భారత్‌లోనూ త్వరలో నియంత్రణ విధానాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని’ సింగపూర్ టెక్నాలజీ లా హెడ్ శ్రీ వివేక్ కత్పాలియా అన్నారు.



Next Story

Most Viewed