కృష్ణా, గోదావరి బేసిన్‌లో వరద ప్రవాహాలు ఇలా..

by  |
కృష్ణా, గోదావరి బేసిన్‌లో వరద ప్రవాహాలు ఇలా..
X

దిశ, న్యూస్ బ్యూరో: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మొదలైంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో అల్మట్టికి భారీ వరద వచ్చి చేరుతోంది. ఆదివారం ఉదయం వరకు అల్మట్టి జలాశయంలోకి 62,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం అల్మట్టిలో 51.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వ 129.72 టీఎంసీలు. ప్రస్తుతం కాల్వలకు 530 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దిగువ నారాయణపూర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 37 టీఎంసీలు. అదేవిధంగా తుంగభద్రకు కూడా వరద మొదలైంది. తుంగభద్రకు 3,522 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉంది. 6.4 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. మరోవైపు గోదావరి బేసిన్‌లో వరద మొదలైంది. దవళేశ్వరం దగ్గర 22,939 క్యూసెక్కుల వరద నమోదైంది. దవళేశ్వరంలో పూర్తి స్థాయి నీటిమట్టం 2.93 టీఎంసీలు చేరడంతో వచ్చిన వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఇన్ ఫ్లో 22,939 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 22,476 క్యూసెక్కులు ఉంది.

Next Story

Most Viewed