పండుగ సీజన్‌లో Flipkart నయా స్కెచ్.. లక్ష మంది దుకాణాదారులతో..!

by  |
Flipkart
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన ‘కిరాణా డెలివరీ ప్రోగ్రామ్’ను బలోపేతం చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక దుకాణాదారుల భాగస్వామ్యంతో డెలివరీ సేవలను అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీనికోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ దేశవ్యాప్తంగా 1,00,000 మంది కిరాణా దుకాణ యజమానులతో భాగస్వామ్యం చేసుకుంది. వీరి ద్వారా ఈ ఏడాది పండుగ సీజన్‌లో సరుకులను డెలివరీ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

గతేడాది పండుగ సీజన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ పొందిన కిరాణా దుకాణాదారుల భాగస్వామ్యంతో మొత్తం కోటికి పైగా డెలివరీలను అందించామని, ఈసారి దాన్ని అధిగమిస్తామనే నమ్మకం ఉందని కంపెనీ వివరించింది. ‘అమ్మకం దారులు, ఎంఎస్ఎంఈ, చేతి వృత్తులవారు, వినియోగదారులు, కిరాణా సహా తమ వాటాదారులకు సరైన ప్రయోజనాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులకు వేగంగా, నాణ్యమైన డెలివరీ సేవలను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తామని’ ఫ్లిప్‌కార్ట్ సరఫరా విభాగం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు.

Next Story

Most Viewed