అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. గెలిచిందెవరు..? ఓడిందెవరు..?

by  |
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. గెలిచిందెవరు..? ఓడిందెవరు..?
X

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వెలువడుతున్న ఫలితాలలో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య హోరాహోరిగా సాగిన పోరులో దీదీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఐదు రాష్ట్రాలలో పలువురు ప్రముఖులు అఖండ విజయం సాధించగా, మరికొందరు విజయం ముందు బొక్క బోర్లా పడ్డారు. కేరళలో 40 ఏళ్ల సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఎల్డీఎఫ్‌ను రెండో సారి అధికార పీఠమెక్కించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదాం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఇప్పటివరకు ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఉమెన్ చాందీ పూతుపల్లి సీటు నుంచి గెలుపొందారు. అదే రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఓటమి పాలయ్యారు.

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఆయన తన ప్రత్యర్థిపై 50 వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. అయితే తన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు ఓటమి అంచున ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి తమిళ్ సెల్వన్‌పై మూడు వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కోయంబత్తూరు (సౌత్) నుంచి కమలహాసన్ 45 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. థౌజెండ్ లైట్స్ నుంచి పోటీ పడుతున్న ఖుష్బూ సుందర్ ఓటమి పాలయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్ కొడుకు ఉదయనిది స్టాలిన్ (చెన్నై చెపాక్) నుంచి విజయం దిశగా దూసుకుపోతున్నారు.

ఇక బెంగాల్ లో టోలిగంజ్ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి బబుల్ సుప్రియో టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో పరాజయం దాదాపు ఖరారైంది.



Next Story

Most Viewed