నేను అబ్బాయిని కాదని నాకు తెలుసు.. అయినప్పటికీ..

by  |
నేను అబ్బాయిని కాదని నాకు తెలుసు.. అయినప్పటికీ..
X

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది వారిని సాక్షత్ దేవతలా భావిస్తారు. మరికొంతమంది సాధారణంగా భావిస్తారు. ఇంకొంతమంది ఛీదరించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వారి జీవనాన్ని గడుపుతుంటారు. అయినా కూడా వాళ్లు అలానే ఉండేందుకే ఇష్టపడుతుంటారు. కారణమేమంటే.. వాళ్ల బాడీలో ఉండే జీన్సే. వాళ్లను అడుక్కునేవారీగానే చూస్తుంటారు. కానీ, వాళ్లు కూడా ఓ ప్రయోజకులు అన్న విషయాన్ని అంతగా గుర్తించరు. ఈ విషయం ఇప్పుడు నేనెందుకు గుర్తు చేస్తున్నానంటే.. మణిపూర్ లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళితే అక్కడ మనకు ఓ డాక్టరమ్మ కనిపిస్తది. ఆమె ప్రస్తుతం ఏ మాత్రం భయపడకుండా కొవిడ్ పేషెంట్లకు సేవలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది.

అయితే, అసలు విషయమేమంటే.. ఆమెది సమాజంలో మూడో రూపం. అదేనండీ ఆమె ఒక హిజ్రా. అవును ఆమె ఓ హిజ్రానే.. ఆమె పేరు బైయోన్స్ లైష్రామ్. ఈ విషయంలో చాలామంది ముందుగా ఆశ్చర్యపోతుంటారని చెబుతోంది. తనని ముందుగా స్త్రీగా భావిస్తారు కానీ, తన వాయిస్ విన్న తర్వాతే తాను హిజ్రాగా నిర్ధారించుకుంటారని తెలుపుతోంది. తాను మెడిసిన్ చదువుకునే రోజుల్లో కూడా తనపై ఎలాంటి వివక్ష చూపలేదని, అందరిలాగే తనపై ప్రేమ, అప్యాయతలు చూపించారని చెప్పింది. ఇలాగే ప్రజలకు వైద్య సేవలందిస్తూ ఉంటానని పేర్కొన్నది. మిగతా హిజ్రాలు కూడా తనలాగే స్వశక్తిపై ఆధారపడి బ్రతకాలని, సమాజం గౌరవించే హోదాలో కొనసాగాలని సూచనలు చేసింది.



Next Story

Most Viewed