తొలిరోజు 37 స్లాట్స్ బుకింగ్

by  |
తొలిరోజు 37 స్లాట్స్ బుకింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజున రాష్ట్రవ్యాప్తంగా 37 స్లాట్ల బుకింగ్ జరిగిందని, దీని ద్వారా రూ. 85 లక్షల మేర ఫీజు జమ అయినట్లు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం తెలియనివారు ‘మీ సేవ’ కేంద్రాల్లో రూ. 200 చెల్లించేలా ధరను ఖరారు చేసినట్లు తెలిపారు. ఇంతకాలం ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘మీ సేవ’ కేంద్రాలకు జనం పోటెత్తే అవకాశం ఉంది. దీంతో ముందుగానే ప్రభుత్వం కనీస ఛార్జీలను ఖరారు చేయడం గమనార్హం.

తొలి రోజునే సుమారు నాలుగు వేల మంది ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలను ప్రారంభించారని ఒక ప్రకటనలో సీఎస్ తెలిపారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బిల్డర్ల కోసం ప్రత్యేకంగా విండో పెట్టామని, భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి అవకాశం కల్పించామని, ఇప్పటికే 93,874 ఆస్తుల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. దీనికి తోడు స్థానిక సంస్థలు కూడా 12,699 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ‘టి-పిన్’ నెంబర్ ఆధారంగా జెనరేట్ చేసినట్లు తెలిపారు.

Next Story

Most Viewed