90 ఏండ్ల బామ్మకు తొలి కరోనా టీకా.. ఎక్కడంటే!

by  |
90 ఏండ్ల బామ్మకు తొలి కరోనా టీకా.. ఎక్కడంటే!
X

లండన్: కొవిడ్-19 మహమ్మారి నియంత్రణ కోసం యూనైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో మంగళవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయో‌ఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌‌కు యూకే ప్రభుత్వం రెండు వారాల క్రితం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. యూరప్‌లో కొవిడ్-19 టీకా పంపిణీ చేస్తున్న తొలి దేశం యూకేనే. మంగళవారం ఉదయం 6.30 గంటలకు 90 ఏండ్ల మార్గరేట్ కీనన్‌కు తొలి టీకాను ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తర్వాత ప్రపంచంలో ఫైజర్‌ టీకాను పొందిన వ్యక్తిగా కీనన్ నిలిచారు.

మార్గరేట్ కీనన్ వచ్చే వారం 91వ పడిలో అడుగు పెట్టనున్నారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా తొలి టీకా తీసుకుంటున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. నా పుట్టినరోజుకు వారం రోజుల ముందు లభించిన బహుమతి ఇది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కొంత సమయం గడపవచ్చు. కొత్త సంవత్సర వేడుకలను కూడా సంతోషంగా జరుపుకోవచ్చు అని కీనన్ పేర్కొన్నారు. కీనన్ స్నేహితులు మ్యాగీ అని పిలుస్తుంటారు. జ్యువెలరీ షాప్‌లో అసిస్టెంగా పనిచేసిన ఆమె నాలుగేండ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆమెకు కుమారుడు, కుమార్తె, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారు.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను గమనిస్తుంటే ఎంతో భావోద్వేగానికి గురయ్యామని బ్రిటిష్ హెల్త్ సెక్రటరీ మాట్ హన్‌కాక్, ఎన్‌హెచ్‌ఎస్ మెడికల్ డైరెక్టర్ స్టీఫెన్ పాయిస్ తెలిపారు.

బ్రిటన్ ప్రభుత్వం మొత్తం 4 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది. ఒక్క వ్యక్తి రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 2 కోట్ల మందికి ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చిన డోసులు సరిపోతాయి.

యూరప్ దేశాల్లో బ్రిటన్‌లో కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేసింది. మహమ్మారి బారిన పడి 61 వేల మంది మృతిచెందారు. ఫైజర్/ బయోఎన్‌టెక్ టీకా మహమ్మారి‌ని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed