ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కంటైన్‌మెంట్ జోన్ల గుర్తింపు

by  |
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కంటైన్‌మెంట్ జోన్ల గుర్తింపు
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతున్నప్రాంతాలను కంటైన్‌మెంట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలను అష్టదిగ్భందనం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6 ప్రాంతాలు రామయ్య బౌళి, మర్లు, బీకే రెడ్డి కాలనీ, సద్దలగుండు, షాషాబ్‌ గుట్ట (కొంత ప్రాంతం) జడ్చర్ల లోని కౌరమ్ పేటను కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో… జిల్లా కేంద్రంలోని 37 వార్డులు, అయిజలో 12, 17, 19, 20 వార్డుల పరిధిలోని కమతంపేట, కాలమ్మపేట, రంగుపేట, తెలుగుపేట, గుర్రంతోట, ఉప్పరిపేట, కుమ్మరిపేట, నదీమ్‌ మసీద్‌ కాలనీ, బ్రాహ్మణ వీధి, సంత బజార్, అంబేడ్కర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించారు. శాంతినగర్‌లో 7వ వార్డు పరిధిలోని జమ్ములమడుగుకు చెందిన ముగ్గురుకి పాజిటివ్‌ రాగా, ఒకరు మృతి చెందారు. దీంతో ఆవార్డుతో పాటు పక్కనున్న వడ్డెపల్లిని కంటైన్‌మెంట్ జోన్ గా ప్రకటించారు. శాంతినగర్‌లోని 3, 4, 5, 6, 8, 8, 10 వార్డులు, రాజోళి మండల కేంద్రం, ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రం‌లో గాంధీ పార్క్‌ కాలనీ, కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్, సుభాష్‌ నగర్‌ ప్రాంతాలను కంటైన్ మెంట్‌జోన్‌గా గుర్తించారు.

Tags: corona, hotspot, containment zones , mahabubnagar district, ts news

Next Story

Most Viewed