లాక్‌డౌన్‌ సరిపోదు.. అనుమానితులను వెతికి పరీక్షించాలి: డబ్ల్యుహెచ్ఓ

by  |
లాక్‌డౌన్‌ సరిపోదు.. అనుమానితులను వెతికి పరీక్షించాలి: డబ్ల్యుహెచ్ఓ
X

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్ డౌన్ పద్ధతిని అనుసరిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే కేవలం లాక్ డౌన్ తో కరోనాను అంతమొందించలేమని తెలిపింది. పరిస్థితులు చేయి దాటి పోకుండా ఈ చర్య పనికొస్తుంది, కానీ ప్రపంచం నుంచి కరోనా భూతాన్ని పారదోలాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ గిబ్రయెసస్ తెలిపారు. లాక్ డౌన్ తో కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలకు మరింత సమయం కలిసి వస్తుందని చెప్పారు. ఈ సమయాన్ని సముచితంగా వినియోగించడం పైనే కరోనా అంతం ఆధారపడి ఉందని వివరించారు. ఈ సమయంలో అనుమానితులను వేగంగా గుర్తించి, మిగతా ప్రజా సమూహం నుంచి వేరు చేసి, విరివిగా టెస్టులు నిర్వహించి, చికిత్స అందించాలని, మరింత మంది అనుమానితులను గుర్తించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

Tags: lockdown, WHO, coronavirus, fight, countries, find, isolate, test, treat



Next Story

Most Viewed