‘ఫిల్హాల్ 2’ సాంగ్ : హార్ట్ బ్రేకింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

by  |
Filhaal-2-song
X

దిశ, సినిమా : కిలాడి అక్షయ్ కుమార్, నూపూర్ సనన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫిల్హాల్’ వీడియో సాంగ్ సూపర్ హిట్ అయింది. బి ప్రాక్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించగా.. అభిమానులు సీక్వెల్ డిమాండ్ చేశారు. దీంతో ‘ఫిల్హాల్ 2’తో ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు వచ్చేసింది టీమ్. అయితే ఫస్ట్ సాంగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ రొమాన్స్‌తో ఉండగా.. సెకండ్ సాంగ్ మాత్రం ప్రేమ, దానివల్ల కలిగే బాధతో నిండిపోయింది.

అనుకోని పరిస్థితుల్లో అక్షయ్ ప్రియురాలు నూపూర్‌కు వేరే వ్యక్తి(అమ్మీ విరాక్‌)తో పెళ్లి అవుతుంది. కానీ తనను మరిచిపోలేని అక్షయ్.. ప్రేమను అర్థం చేసుకుని తనతో లైఫ్‌లాంగ్ ఉండాలని కోరుతాడు. కానీ మూడుముళ్ల బంధానికి విలువిచ్చిన తను ఇందుకు నిరాకరిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అక్షయ్ రోడ్డుప్రమాదంలో చనిపోగా.. హార్ట్‌బ్రేక్‌తో ఎండ్ అవుతుంది. ఈ పాటలో అక్షయ్ డిఫరెంట్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో కనిపించగా.. ఎప్పటిలాగే నూపూర్ సనన్ అందంగా కనిపించింది. ఇక అమ్మీ విరాక్ కనిపించిన కొద్ది సేపు తనదైన మార్క్ చూపించగలిగాడు. జూలై 6న విడుదలైన పాట 24గంటల్లో 5మిలియన్ వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌లో నెంబర్ వన్‌ స్థానంలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Next Story

Most Viewed