మహిళా ఉపాధ్యాయురాలి 'విజయం'

by  |
మహిళా ఉపాధ్యాయురాలి విజయం
X

దిశ, నాగార్జున సాగర్: అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన. దానికి తగిన పట్టుదల ఉండాలే కానీ వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి పర్వతాన్నైనా ఎక్కేయొచ్చని ఒక మహిళా ఉపాధ్యాయురాలు ‘విజయం’ సాధించి చూపింది. ఉత్తరాఖండ్ లోని రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించి ఔరా..! అనిపించి ఉపాధ్యాయ వృత్తికి మారుపేరుగా నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరుకు చెందిన కర్ర విజయలక్ష్మీ.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామంలో ఎస్జీటీ టీచర్‎గా పనిచేస్తోంది. జీవితంలో ఏదైనా ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే తపనతో ఉండే ఆమె.. గత నెల 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించింది. ఎత్తెన పర్వతాన్ని అధిరోహించిన టీచర్‎గా జిల్లాకు ఖ్యాతిని తెచ్చి పెట్టింది. నిరంతర సాధనతోనే ఆమెకు ఈ విజయం సాధ్యమైందని పలు ఉపాధ్యాయ సంఘాలు అభినందించారు.



Next Story

Most Viewed