‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’.. ప్రభాస్ బర్త్‌డే ట్రీట్!

71

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది ‘రాధే శ్యామ్’. పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రేమకు సాక్ష్యంగా ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ పేరుతో ఈ నెల 23న మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. మోషన్ పోస్టర్ ద్వారా రాధే శ్యామ్ హార్ట్ బీట్స్ ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండాలని పోస్ట్ పెట్టారు ప్రభాస్.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బర్త్‌డే ట్రీట్‌పై కాస్త డిజప్పాయింట్ అయినట్లు చెప్తున్నారు. టీజర్ వస్తుందని అనుకుంటే.. మోషన్ పోస్టర్‌తో సరిపెడుతున్నారా! అంటున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ఇటలీలో షూటింగ్‌తో బిజీగా ఉండగా.. మరో గిఫ్ట్ ఏదైనా రెడీ చేయమని ప్రభాస్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రాధే శ్యామ్ రిలీజ్ కానుంది.