కారుణ్య ఉద్యోగం కోసం కాటికి పంపాడు

by  |
crime
X

దిశ, వెబ్‌డెస్క్ : అవసరం మనిషితో ఏ పని అయినా చేయిస్తుంది. దానికి నా వాళ్లు, బయటి వాళ్లు అనే తేడా ఉండదు. తాను కోరుకున్నది దక్కించుకునేందుకు మనిషి ఎంత నీచానికైనా దిగజారుతాడనే దానికి ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకివెళితే.. 35 ఏళ్లు నిండినా ఓ వ్యక్తికి జాబ్ లేదు. దాంతో నిరాశకు లోనైన అతను తన తండ్రి ఉద్యోగంపై కన్నేశాడు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న తండ్రి చనిపోతే కారుణ్య మరణం కింద ఉద్యోగం వస్తుందని ఆలోచన చేశాడు.

అనుకున్నదే తడవుగా తండ్రి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంగఢ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. రాంగఢ్‌లో బర్కాననాలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌(సీసీఎల్)లో హెడ్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తున్న కృష్ణ రామ్ పెద్ద కొడుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు బర్కాననాలోని క్వార్టర్స్‌లో మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టిన ఎస్‌డీపీఓ ప్రకాశ్ చంద్ర మహ కన్నకొడుకే అసలు నిందితుడిగా తేల్చారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తండ్రి ఉద్యోగం కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. కాగా, సర్వీసులోనే ప్రాణాలు కోల్పోయిన లీగల్ డిపెండెంట్‌కు ఆ ఉద్యోగం ఇచ్చే నిబంధన సీసీఎల్ అమలు చేస్తున్నది.



Next Story

Most Viewed