బిజినపల్లిలో ఘోర ప్రమాదం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం

201
road-accident

దిశ, నాగర్ కర్నూల్: అతివేగం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. రెండు బైకులు ఎదురెదుగా ఢీ కొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివ కుమార్ గౌడ్(30), బాలయ్య గౌడ్(60) వనపర్తి నుండి స్వగ్రామానికి తిరిగివస్తున్నాడు. మరోవైపు కోడెరు ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు బైకుపై వనపర్తి వైపు వెళ్తున్నారు. ఇద్దరు బిజినపల్లి పోలీస్ స్టేషన్ ఎదుటకు రాగానే, అతివేగంగా వచ్చి ఎదురెదుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు మృతి చెందారు. మరో బైకుపై వచ్చిన ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..