సాగు చట్టాలు మత గ్రంథాలా?: ఫరూఖ్ అబ్దుల్లా

by  |
సాగు చట్టాలు మత గ్రంథాలా?: ఫరూఖ్ అబ్దుల్లా
X

న్యూఢిల్లీ: సాగు చట్టాలేమైనా మత గ్రంథాలా? మార్చలేకుండా ఉండటానికి, దేశ అవసరాలకు తగినట్టుగా వ్యవహరించడం అవసరమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా పార్లమెంట్‌లో కేంద్రానికి సూచించారు. సాగు చట్టాలు మార్చాలని రైతులు డిమాండ్ చేసినప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరమేముంటుందని ప్రశ్నించారు. రైతులతో ఎందుకు చర్చించరని అడిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట, భేషజాలకు పోవద్దని కోరారు.

‘ఇది మనందరి దేశం. మనమంతా ఈ దేశానికి చెందినవారం. కాబట్టి, దేశంలోని ప్రతి పౌరుడిని గౌరవించండి’ అని తెలిపారు. అమెరికా, యూకేల కంటే ఎక్కువ మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయని అంచనా వేశారు. గ్రామాల్లో మరణాలను నిర్ధారించే పటిష్ట వ్యవస్థ లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed