'ముందు రైతులది.. తర్వాత అధికారులది.. ఆ తర్వాత ప్రభుత్వానిది'

by  |
ముందు రైతులది.. తర్వాత అధికారులది.. ఆ తర్వాత ప్రభుత్వానిది
X

దిశ, ఖమ్మం: ‘మొక్క‌జొన్న‌ల‌ను కొనుగోలు కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్న రైతులు కాంటా పూర్తయ్యేంతవ‌ర‌కూ బాధ్య‌త తీసుకోవాలి. కాంటాలు పూర్త‌య్యాక అధికారులు బాధ్య‌త తీసుకుంటారు. కాంటా వేసిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది’ అని అంటున్నది ఎవరో కాదు.. ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్. సోమవారం ఖ‌మ్మం జిల్లా లోని చింత‌కాని మండ‌లం లచ్చగూడెం, నాగులవంచ, ముష్టికుంట్ల గ్రామాల్లోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల‌ను ఆయన సంద‌ర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన మొక్క‌జొన్న నిల్వ‌ల వివ‌రాల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాని ఎమ్మార్వో తిరుమ‌లాచారి, చింతకాని, నాగులవంచ సొసైటీ చైర్మన్ ఉండవల్లి శేఖర్ రెడ్డి, నల్లమోతు శేషగిరి, త‌దిత‌రులు ఉన్నారు.

Next Story

Most Viewed