డబ్బులు తీసుకుని మాట మార్చాడని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు

80

దిశ, వేములవాడ : భూమి విషయంలో వివాదం నెలకొనడంతో మనస్తాపం చెందిన రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. మండల కేంద్రానికి చెందిన మర్రి రాజు అనే రైతు కోన దేవరాజు వద్ద రెండు ఎకరాల భూమిని ఏడాది కిందట రూ. 32 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇందులో రూ.22 లక్షలను మర్రి రాజు ఏడాది కిందటే చెల్లించాడు. మిగతా డబ్బులు రూ.10 లక్షలు తీసుకుని పట్టా చేయాలని ఇటీవల కోరగా అందుకు దేవరాజు నిరాకరించాడు. ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా దేవరాజు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు బాధితుడు వాపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధిత రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలపడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిసింది. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..