ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి.. వారి నిర్లక్ష్యమే కారణమా ?

by  |
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద  రైతు మృతి.. వారి నిర్లక్ష్యమే కారణమా ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తెచ్చిన రైతు దానికి కాపలగా ఉండి అక్కడే గుండేపోటుతో మృతి చెందిన స్థానికంగా కలకలం రేపుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం సోసైటిల నిర్వహకులు ఎప్పుడు కాంటా ( తుకం వేస్తారో) చేస్తారో తెలియని పరిస్థితికి రైతు మరణం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రాత్రి సమయంలో గుండె నొప్పి‌తో మామిడి చిన్న బీరయ్య (56) అనే రైతు మృతి చెందాడు.

శుక్రవారం ఎండ నడినెత్తిమీదకు వచ్చిన ధాన్యం కుప్పపై నిద్రిస్తున్న బీరయ్య లేవకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడి రైతులు అతన్ని కదిలిచడంతో అతను చనిపోయాడని గ్రహించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బీరయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణంను స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపన పోలేదు. బీరయ్య భార్య పేరుమీద ఉన్న పోలంలో పండిన ధాన్యంను గత నెల 27న కొనుగోలు కేంద్రం‌కు తీసుకువచ్చినప్పటికి తుకాలు వేయ్యలేదు సోసైటి నిర్వహకులు. దాంతో బీరయ్య వారం రోజులుగా ధాన్యం కాపాలగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండురోజులుగా వర్షం పడుతుండటంతో ధాన్యం తడవకుండా కాపాడటంలోనే బీరయ్య ప్రాణాలు వదిలాడని వారు వాపోతున్నారు.

Next Story

Most Viewed